పెద్దపల్లిలో మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలనలో సీపీ శ్రీనివాస్
పెద్దపెల్లి,(విజయక్రాంతి): గణపతి నవరాత్రుల ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని, పెద్దపల్లిలో మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలనలో సీపీ శ్రీనివాస్ అన్నారు. జిల్లాలో వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలు, గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి సందర్భంగా పెద్దపల్లి డిసిపి చేతన, ఏసిపి కృష్ణ, మున్సిపల్ కమిషనర్ లతో కలిసి పట్టణంలో పర్యటించి వినాయక నిమజ్జనానికి సంబంధించి మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించారు. నిమజ్జనం రోజు క్రేన్స్ ఎక్కడ ఎక్కడ ఏర్పాటు చేయాలని, నిమజ్జనానికి వచ్చే వాహనాల రూట్ ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు గురించి మున్సిపల్ కమిషనర్, పోలీస్ అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా సీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ... రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపెల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి, మిలాద్- ఉన్- నబీ ల పండుగ ల దృష్ట్యా శాంతి సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం చెరువును బోటులో సందర్శించారు. సిపి వెంట పెద్దపల్లి మున్సిపల్ కమీషనర్, పెద్దపెల్లి ఏసిపి జి కృష్ణ యాదవ్, పెద్దపెల్లి సిఐ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ఎస్సై లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.