మానుకోట ఎమ్మెల్యే మురళి నాయక్...
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఆటలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని మానుకోట ఎమ్మెల్యే మురిళినాయక్ అన్నారు. సోమవారం మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నెహ్రు యువ కేంద్రం వరంగల్ ఆధ్వర్యంలో బ్లాక్ స్ధాయి క్రీడల పోటీలు క్రీడోత్సవ బహుమతి ప్రధానోత్సవంలో ఎమ్మెల్యే మురళినాయక్ పాల్గొని బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్బగా డిగ్రీ కళాశాలలో తరగతి గదులను కళాశాల ఆవరణంను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు యువత శారీరక, మానసిక శ్రేయస్సుకు దోహదపడుతాయని అన్నారు. క్రీడకారులు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నుండి అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్ధానిక వార్డు కౌన్సలర్ బుజ్జి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.