calender_icon.png 12 January, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గేమ్ ఛేంజర్’ టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు వెనక్కి

12-01-2025 01:31:27 AM

* స్పెషల్ షోలకు నో పర్మిషన్

* హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభు త్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. హై కోర్టు ఆదేశాల మేరకు గేమ్ ఛేంజర్ టికెట్ ధరలు, అదనపు షోలకు ఇటీవల ఇచ్చిన అనుమతులను ప్రభు త్వం వెనక్కి తీసుకుంది.

తెలంగాణలో ఇక నుంచి తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతిలేదని ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రజల భద్రత, ఆరో గ్యం దృష్ట్యా సినిమాల స్పెషల్ షోల కు ఎటువంటి అనుమతి ఇవ్వబోమని వెల్లడించింది.

రామ్‌చరణ్ హీరోగా, దర్శకుడు శంకర్, నిర్మాత దిల్‌రాజు తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు సినిమా టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. సినిమా విడు దల రోజు ఈ నెల 10న ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు అనుమతి ఇచ్చింది.

విడుదల రోజు సింగిల్ స్క్రీన్‌లో అదనంగా రూ.100, మల్టీప్లెక్సు ల్లో రూ.150 టికెట్ రేట్లను పెంచుకునేందుకు, ఈ నెల 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వు లు జారీచేసింది. తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఆ ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.