- క్వాంటం కంప్యూటింగ్‌లో కీలక మైలురాయి
- పూర్తి స్థాయి ఫంక్షనాలిటీ టెస్ట్‌లో పాస్
- ఘనత సాధించిన డీఆర్‌డీవో, టాటా ఇనిస్టిట్యూట్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: సెమీకండక్టర్ పరిశ్రమలో అగ్రగామిగా ఎదగాలని భావిస్తోన్న భారత్.. అందుకు సంబంధించి కీలక ముందడుగు వేసింది. పుణేలోని డీఆర్‌డీవో యంగ్ సైంటిస్ట్స్ లేబొరేటరీ ఫర్ క్వాంటం టెక్నాలజీస్ (డీవైఎస్‌ఎల్ ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంట ల్ రీసెర్చ్(టీఐఎఫ్‌ఆర్) శాస్త్రవేత్తలు క్యాంటం సాంకేతికతలో పురగోతి సాధించారు. 6 క్యాంటం బిట్ (క్యూయూబిట్) ప్రాసెసర్‌ను పూర్తిస్థాయిలో విజయవంతంగా పరీక్షించా రు. ఈ విజయం భారత్ క్యాంటం కంప్యూటింగ్ సాంకేతికత సామర్థ్యంలో కీలకమైన ముందడుగును సూచిస్తుంది. అపెక్స్ కమిటీ ముందు నిర్వహించిన ఈ టెస్ట్‌లో రెండు సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఈ ప్రాసెసర్ పూర్తి స్థాయిలో పనిచేసింది.
అడ్వాన్స్‌డ్ మెక్రో చిప్ తయారీకి..
క్యాంటం టెక్నాలజీ అనేది రీసెర్చ్, డెవల్‌మెంట్‌కు సంబంధించిన అంశం. ఇది పూర్తి గా క్యాంటం మెకానిక్స్ సూత్రాలను ప్రభావితం చేస్తుంది. ఇది పరమాణు, ఉపపరమా ణు స్థాయిల్లో కణాల ప్రవర్తన ఆధారంగా పనిచేసే భౌతిక శాస్త్ర విభాగం. పరమాణు నియమాలను అనుసరించి కొత్త డివైజులు, సిస్టమ్స్‌ను రూపొందించడంతో పాటు సంప్రదాయ టెక్నాలజీకి ప్రత్యామ్నాయంగా వివిధ పరికరాల రూపకల్పన చేయవచ్చు. ఇందులో క్యాంటం కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్, సిమ్యూలేషన్స్ అంతర్భాగంగా ఉంటాయి.
దీన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రపంచంలోనే అడ్వాన్స్‌డ్ మైక్రో చిప్ తయారీకి డీఆర్‌డీవో, టీఐఎఫ్‌ఆర్ పరిశోధన ప్రారంభించి సఫలీకృతమయ్యాయి. 6 బిట్ ప్రాసెసర్‌లో ఆరు క్యాంటం బిట్‌లను ఉపయోగించి సమాచారాన్ని ప్రాసెస్ చేసే ఒక క్యాంటం కంప్యూటింగ్ పరికరం. క్యాంటం కంప్యూటింగ్‌లో క్యూయూబిట్ అనేది క్యాంటం సమాచారంలో బేసిక్ యూనిట్‌గా పరిగణిస్తారు. భారత శాస్త్రవేత్తలు క్లౌడ్ ఆధారిత ఇంటర్‌ఫేస్ ద్వారా క్యాంటం సర్క్యూట్‌ను సమర్పించారు.
ఎందుకింత ప్రత్యేకం
ఈ ప్రాజెక్టును డీవైఎస్‌ఎల్ టీఐఎఫ్‌ఆర్, టీసీఎస్ సంయుక్తంగా చేపట్టాయి. ఇందులో ఆఫ్‌ది షెల్ఫ్ ఎలక్ట్రానిక్స్, కస్టమ్ ప్రోగ్రామ్డ్ డెపలప్‌మెంట్ బోర్డ్ కలయికను ఉపయోగించి కంట్రోల్ ఆపరేటస్‌ను డీవైఎస్‌ఎల్ అభివృద్ధి చేసింది. క్యూయూబిట్స్ డిజైన్, నిర్మాణ బాధ్యతలు టీఐఎఫ్‌ఆర్ శాస్త్రవేత్తలు చేపట్టారు. ఇందుకోసం సంస్థలో అభివృద్ధి చేసిన నావెల్ రింగ్ అర్కిటెక్చర్‌ను ఉపయోగించారు. ఈ 6 ప్రా సెసర్ పరీక్ష విజయవంతం కావడం భారత క్యాంటం కంప్యూటింగ్ ప్రయాణం లో కీలక మైలురాయిగా పేర్కొనవచ్చు. ఇది టెక్నాలజీ రంగంలో భారతలో పెరుగుతున్న నైపుణ్యంతో పాటు గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ రేసులో దేశాన్ని స్థానాన్ని పదిలపరిచింది.
భవిష్యత్తుల్లో మరిన్ని..
ఈ ప్రాసెసర్ పనితీరులో వివిధ అంశాల ను ఆప్టిమైజ్ చేయడంపై పరిశోధనా బృందం దృష్టి సారించింది. విద్య, పరిశోధన రంగాల కోసం ఈ క్వాంటం వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించేందుకు ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. ముఖ్యంగా సూపర్ కండక్టింగ్ క్వాంటం పరికరాలను విశ్లేషించడానికి పరీక్షా సాధనంగా దీన్ని వినియోగించాలని భావిస్తున్నారు. ఈ ప్రయోగం తర్వాతి దశ లో క్యాంటం బిట్ల పెంపు, అతిపెద్ద క్యాంటం వ్యవస్థలతో అనుసంధానం వంటి సవాళ్లపై శాస్త్రవేత్తలు దృష్టి సారించనున్నారు. ఇందు లో సాంకేతిక అవరోధాలు, వివిధ పరిమాణాల్లో క్వాంటం కంప్యూటర్ల రూపకల్పన, వాణిజ్యీకరించడానికి అవసరమైన వనరులను పరిశీలించనున్నారు.