రామ్ చరణ్, కియారా అద్వాణి జంటగా నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలై మంచి సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా నటించాడు. ఈ సినిమా శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వెర్షన్‌కు కాస్త సమయం పడుతుందని ప్రైమ్ వీడియో తెలిపింది. 2 గంటల 37 నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది.