calender_icon.png 13 April, 2025 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో భారత సంతతి వ్యక్తిపై గ్యాంబ్లింగ్ కేసు

12-04-2025 11:54:46 PM

న్యూయార్క్: భారత సంతతికి చెందిన రాజకీయ నాయకుడిపై అమెరికాలో గ్యాంబ్లింగ్ కేసు నమోదైనట్టు న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్కిన్ పేర్కొన్నారు. గ్యాంబ్లింగ్ సహా పలు అక్రమ కార్యకలాపాల్లో భారత సంతతికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షా ప్రమేయం ఉందని, గ్యాంబ్లింగ్, మనీలాండరింగ్ ఇతర నేరాలకు పాల్పడిన 39 మంది వ్యక్తుల్లో ఆనంద్ ఒకరని వెల్లడించారు. రాష్ట్రంలోని 12 ప్రదేశాల్లో దాడులు చేసి అభియోగాలు మోపినట్టు తెలిపారు.

న్యూయార్క్ శివారు ప్రాంతమైన ప్రాస్పెక్ట్ పార్క్‌లో మున్సిపల్ కౌన్సిలర్‌గా విధులు నిర్వర్తించిన షా రెండోసారి పదవిలో కొనసాగుతున్నారు. ఆర్థిక అభివృద్ధి, బీమా బాధ్యతలను కూడా నిర్వహించారు. ఫ్లోరిడాలోని లాంగ్‌వుడ్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన మరో వ్యక్తి సమీర్ ఎస్ నాదకర్ణి స్పోర్ట్స్‌బుక్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నందు వల్ల అతడిపై అభియోగాలు మొదలైనట్లు తెలిపారు. అమెరికాలోని అతి ప్రమాదకరమైన గ్రూప్‌లలో ఒకటైన ‘లూచీస్ క్రైమ్ ఫ్యామిలీ’ అనే సంస్థతో కలిసి ఆనంద్ చట్టవిరుద్ధంగా పోకర్ గేమ్‌లను, ఆన్‌లైన్ స్పోర్ట్స్‌బుక్‌ను నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.