calender_icon.png 31 October, 2024 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి కొంటూ పోలీసులకు చిక్కిన జూడాలు

06-07-2024 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (విజయక్రాంతి): విక్రేత వద్ద గంజాయి కొనుగోలు చేస్తూ ఇద్దరు జూనియర్ డాక్టర్లు నార్కోటిక్స్ బ్యూ రో, సుల్తాన్ బజార్ పోలీసులకు చిక్కారు. గంజాయి విక్రేత సహా జూ డాలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం ఉదయం కోఠిలోని ఉస్మా నియా మెడికల్ కాలేజీ వద్ద సురేష్ సింగ్ అనే వ్యక్తి వద్ద డాక్టర్ కే మణికందన్, డాక్టర్ వీ అరవింద్ గంజా యి కొనుగోలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 80గ్రాముల గంజాయి, 2మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. జూడాలకు పరీక్షలు చేయించగా పాజిటివ్‌గా రావడంతో గంజాయి విక్రేత సహా జూడాలపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.