calender_icon.png 21 April, 2025 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాటరాయుళ్ల అరెస్టు

06-04-2025 11:14:23 PM

మంచిర్యాల (విజయక్రాంతి): పట్టణంలోని తిలక్ నగర్ చెట్ల పొదల్లో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్న ఏడుగురిని ఆదివారం క్రైం పార్టీ సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు మంచిర్యాల పట్టణ ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... తమకు అందిన పక్కా సమాచారంతో తిలక్ నగర్ చెట్ల పొదల్లో దాడి చేయగా పేకాట ఆడుతూ గోదార్ల రమేష్, దేవుసాని కుమార్, ఆటకారి శ్రీను, వనం లక్ష్మన్, మాచర్ల వెంకటేష్, తోకల శ్రీనివాస్, గౌరీ ప్రసాద్ లు పట్టబడ్డారని, వారి నుంచి రూ. 2100 నగదుతో పాటు నాలుగు మొబైల్స్, రెండు మోటర్ సైకిల్స్ ని సీజ్ చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ఈ దాడిలో పోలీసు సిబ్బంది, క్రైం పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.