calender_icon.png 6 April, 2025 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాటరాయుళ్ల అరెస్టు

05-04-2025 08:05:07 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని అశోక్ నగర్ లో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు పట్టుకున్నారు. బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్హెచ్ఓ ఎన్ దేవయ్య తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్ నగర్లో శనివారం ముక్కెర వెంకటేష్  ఇంటి వద్ద పేకాట అడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎన్ దేవయ్య తన పోలీస్ సిబ్బంది తో అక్కడకి వెళ్ళి ఇంటి పై దాడి చేశారు.

పేకాట ఆడుతున్న బెల్లంపల్లికి చెందిన ముక్కెర వెంకటేష్, జంగం క్రాంతి కుమార్, గొడుగు రమేష్, తొగరి సురేష్, యాదగిరి మహేష్, బాకం సుమన్, గజ్జల స్వామి, ఎరుకల శ్రీనివాస్, సుండురీ మల్లాద్రి లను పట్టుకున్నారు. వారి నుండి (52) పేకా ముక్కలు, నగదు రూ.లు.12550/-, మొబైల్ ఫోన్ లు -7, బైక్- 5 స్వాదినo చేసుకున్నారు. నిందితులపైన చట్ట పరమైన చర్యలు తీసుకొవడానికి పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ హెచ్ ఓ దేవయ్య తెలిపారు.