calender_icon.png 19 January, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంభీర్ అలా.. కోహ్లీ ఇలా

19-09-2024 12:00:00 AM

 ‘మసాలా’కు ముగింపు పలికిన స్టార్లు

 ఇద్దరి ఇంటర్వ్యూ వీడియో రిలీజ్

చెన్నై: విరాట్ కోహ్లీ గంభీర్.. ఇద్దరిలో ఎవరూ తక్కువ కాదు. ఈ ఢిల్లీ బ్యాటర్లకు గెలవడం మీద ఎంతో ప్రేమ. గెలుపు కోసం ఎంత దూరమైనా వెళ్లి, ఏదైనా చేయగల సత్తా వీరి సొంతం. అటువంటి గంభీర్ మార్గనిర్దేశనంలో మరో స్టార్ విరాట్ కోహ్లీ ఆడబోతున్నాడు. ఐపీఎల్ వేదికగా విరాట్ మధ్య గొడవలు జరగడంతో అంతా వీరిద్దరు కలిసి ఉండలేరు అని అనుకున్నారు. కానీ గంభీర్ హెడ్ కోచ్‌గా పగ్గాలు చేపట్టి ఇండియాను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ తరుణంలో విరాట్ కోహ్లీతో సరదాగా గడుపుతున్నాడు.

ఈ ఇద్దరు స్టార్లు సరదాగా మాట్లాడిన ఇంటర్వ్యూను బీసీసీఐ రిలీజ్ చేసింది. 2014 ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా విరాట్ కోహ్లీ.. ఓం నమఃశివాయ అంటూ చితక్కొడితే, గంభీర్ హనుమాన్ చాలీసా వింటూ కంగారు పెట్టాడట. ఆ సిరీస్‌లో విరాట్ విశ్వరూపం చూపెట్టాడు. ఏకంగా నాలుగు సెంచరీలతో 632 పరుగులు చేశాడు. ఇక గంభీర్ కూడా నేపియర్ టెస్టులో ఆసీస్ బౌలర్లకు ఎదురునిల్చుని మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. అయినా కానీ ఆ సిరీస్‌లో మాత్రం టీమిండియా ఓడిపోయింది. 

మసాలాకు ఇక ముగింపు.. 

గంభీర్ మధ్య గొడవలు ఉన్నాయని వారిద్దరూ కలిసి ఉండలేరని చాలా కాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు పుల్ స్టాప్ పెడుతూ ఈ ఇద్దరు స్టార్లు క్లారిటీ ఇచ్చారు.మసాలాకు ఇక ముగింపు పలుకుదాం అని కోహ్లీ అంటే గంభీర్ ఓకే అని తెలిపాడు.