- విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
- బార్‌లను తలపిస్తున్న పర్మిట్ రూంలు
- కల్తీ ఆహార పదార్థాలు సరఫరా
- మేడ్చల్‌లో మద్యం వ్యాపారుల ఇష్టారాజ్యం
- పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
మేడ్చల్, జనవరి 19(విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో, గ్రామాలలో గల్లీ కో బెల్ట్ షాప్ ఏర్పాటయింది. మద్యం విక్రయా లు పెంచుకోవడానికి వైన్స్ ల యజమానులే బెల్ట్ షాపులను ఏర్పాటు చేయించారు. మేడ్చల్ పట్టణంలో వైన్ షాపులన్నీ జాతీయ రహదారి మీదనే ఉన్నాయి. దీంతో వైన్ షాప్ ల యజమానులు గల్లీలలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేయించి మద్యం సరఫరా చేస్తున్నారు.
కొన్నిచోట్ల అనుమతి లేని కల్లు దుకాణాల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రధాన రహదారి వరకు వెళ్లలేని వారు బెల్ట్ షాపులలోనే కొనుగోలు చేస్తున్నారు. గ్రామాలలోనూ ఇదే పరిస్థితి ఉంది. మద్యం దుకాణాల నుంచి ఎమ్మార్పీ ధరలకు కొనుగోలు చేసి బెల్ట్ షాపులలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
స్థానికం గానే మద్యం దొరకడంతో ధర ఎక్కువైనా బెల్ట్ షాపులలోనే కొనుగోలు చేస్తున్నారు. కొన్ని బెల్ట్ షాపులలో సిట్టింగ్ ఉండడంతో మందుబాబులు అక్కడే తాగుతున్నారు. కాలనీవాసులు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
బార్‌లను తలపిస్తున్న పర్మిట్ రూంలు
వైన్స్ లో మద్యం కొనుగోలు చేసి అక్కడే తాగడానికి ఎక్సైజ్ శాఖ పర్మిట్ రూములకు అనుమతినిస్తుంది. పర్మిట్ రూం లలో స్టఫ్ తో మద్యం తాగి వెళ్లిపోవాలి. ఇక్కడ వండడానికి వీలు లేదు. కానీ పర్మిట్ రూంలు బార్ లను తలపిస్తున్నాయి. వైన్ షాప్ ల యజమానులు పర్మిట్ రూమ్ ల మీద అదనపు ఆదాయం పొందుతున్నారు. వీటి నిర్వహణను ఇతరులకు కాంట్రాక్ట్ ఇస్తున్నారు.
వీరు నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూములను నిర్వహిస్తున్నారు. ఆహార పదార్థాలు వండటమే కాకుండా మందు బాబులు తెచ్చుకున్న పదార్థాలను లోనికి అనుమతించడం లేదు. బయటి పదార్థాలకు అనుమతి లేదని ఏకంగా బోర్డులు పెట్టేశారు. పర్మిట్ రూములలో కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారు.
అంతేగాక అధిక ధరలకు విక్రయించి మందుబాబులను దోచుకుంటున్నారు. వైన్ షాపుల్లో మద్యం మినహా ఇతర వస్తువులు అమ్మడానికి వీలు లేదు. కానీ స్టఫ్ ను విక్రయిస్తున్నారు. షాపుల్లో పనిచేసే వారికి యజమాని వేతనం ఇవ్వడం లేదు. వర్కర్లు స్టాప్ ను విక్రయించుకోవాలి. పర్మిట్ రూ ములలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
మేడ్చల్ లో ఎక్సైజ్ కార్యాలయం ఉంది. సీఐ, ఎస్త్స్రలు, ఇతర సిబ్బంది ఉన్నారు. కానీ వీరు ఎప్పుడూ అందు బాటులో ఉండరు. సీఐ కార్యాలయా నికిరారు. ఎవరైనా ఫోన్ చేసినా సమా ధానం ఇవ్వరు. ఈ ప్రాంతంలో గంజా యి, ఇతర మత్తు పదార్థాల రవాణా జోరుగా సాగుతుంది. వీటిని ఎన్ఫోర్స్ మెంట్, ఎస్‌ఓటి, నార్కోటిక్ తదితర వి భాగాల వారే పట్టుకుంటున్నారు.
స్థాని క ఎక్సైజ్ అధికారులు మాత్రం ఇటీవ ల కాలంలో ఒక్క కేసు కూడా పట్టుకో లేదు. ఇక్కడ అధికారులు కేవ లం వ సూళ్లకే ఉన్నారని, అక్రమలను పట్టిం చుకోరని ఆరోపణ లు ఉన్నాయి. ఇప్ప టికైనా ఉన్నతాధికారులు బెల్ట్ షాపుల ను, పర్మిట్ రూంలో దోపిడీని అరికట్టా లని మందుబాబులు కోరుతున్నారు.