11-03-2025 12:00:00 AM
పటాన్ చెరు, మార్చి 10 : తెలంగాణ శాసనమండలి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన విజయశాంతిని పార్టీ రాష్ట్ర నాయకుడు గాలి అనిల్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో విజయశాంతిని కలిసి శాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.