calender_icon.png 17 January, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాలా ప్రెసిషన్ ఇంజినీరింగ్ ఐపీవో

03-09-2024 03:18:49 AM

నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్ర్కైబ్

న్యూఢిల్లీ: గాలా ప్రెసిషన్ ఇంజినీరింగ్ ఐపీవోకు అనూహ్య స్పందన లభించింది. సోమవారం ప్రారంభమైన నిమిషాల్లోనే షేర్లన్నీ పూర్తిగా సబ్‌స్ర్కైబ్ అయ్యాయి. 22.24 లక్షల షేర్లు పబ్లిక్ ఇష్యూలో అందుబాటులో ఉండగా.. ఉదయం 11.21 గంటలకే 47.77 లక్షల షేర్లకు (2.15 రెట్లు) బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ సెగ్మెంట్లో 3.15 రెట్లు, సంస్థాగతేతర మదుపర్ల విభాగంలో 2,54 రెట్ల షేర్లకు దరఖాస్తులు లభించాయి. సెప్టెంబరు 4 వరకు సబ్‌స్క్రిప్షన్ కొనసాగనుంది.

గాలా ప్రెసిషన్ ఇంజినీరింగ్ తమ ఐపీఓ ధరను రూ.503- 529గా నిర్ణయించింది. రిటైల్ మదుపర్లు రూ.14,812లో కనీసం 28 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. గరిష్ట ధర వద్ద మొత్తం రూ.168 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ఐపీఓలో రూ.135,34 కోట్లు విలువ చేసే 25.58 లక్షల కొత్త పేర్లతో పాటు రూ.32.58 కోట్లు విలువ చేసే షేర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద అందుబాటులో ఉన్నాయి. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను తమిళనాడులో కొత్త తయారీ కేంద్రం ఏర్పాటు, కొత్త పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులు వంటి వాటికి వినియోగిస్తామని కంపెనీ వెల్లడించింది. మరికొన్ని నిధులను కార్పొరేట్ అవసరాలకు కూడా వాడతామని చెప్పింది.