గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మదీనా మజీద్ లో ఆదివారం మజీద్ కమిటీకి నిర్వహించిన ఎన్నికల్లో సయ్యద్ మతిన్ విజయం సాధించారు. తంజిముల్ మజీద్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన సయ్యద్ మతిన్ ను డీసీసి అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పట్టణ ప్రముఖులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మతిన్ మాట్లాడుతూ.. మజీద్ కమిటీ చైర్మన్ గా ఎన్నుకున్న ముస్లిం సోదరులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తంజముల్ మజీద్ కమిటీ ద్వారా గజ్వేల్ ప్రాంత ముస్లింలందరికీ ఉత్తమ సేవలందిస్తున్నట్లు సయ్యద్ మతిన్ పేర్కొన్నారు.