గజ్వేల్,(విజయక్రాంతి): గజ్వేల్ పట్టణంలోని సంతోషిమాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ఆదివారం అర్ధనారీశ్వరిగా దర్శనమిచ్చింది. ఆలయ ప్రధాన అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తికి చతుషష్టి ఉపచార పూజ, మహిళలచే కుంకుమార్చనలు, నిత్యాను దానం నిర్వహించారు. ప్రతినిత్యం అమ్మవారికి సహస్ర దీపాలంకరణ నిర్వహిస్తున్నారు.