20-03-2025 12:31:17 AM
కొండపాక,మార్చి 19:గజ్వెల్ ఎమ్‌ఎల్‌ఏ కెసిఆర్, నియోజకవర్గంలో కనబడుట లేదని కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ మెరుగు ప్రభాస్ బుధవారం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ప్రభాస్, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అధ్యక్షులు, మాజీ సీఎం, గజ్వేల్ నియోజకవర్గం ఎమ్‌ఎల్‌ఏ కెసిఆర్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా, అటు అసెం బ్లీ సమావేశాలకు వెళ్లకుండా, తన ఫామ్ హౌస్ లో ఉండి,గత 15 నెలల నుంచి ప్రభు త్వం నుంచి జీతం తీసుకుంటున్నాడని అ న్నారు.
ఎమ్మెల్యే కార్యాలయం నందు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమ స్యలను పరిష్కరించాలని, అలాగే ముంపు గ్రామాల ప్రజల సమస్యలను సృష్టించింది కే సి ఆర్, ఆ సమస్యలను పరిష్కరించేది కే సి ఆర్ అని ముంపు గ్రామాల ప్రజలు కోరారని అన్నారు. గత 15 నెలల నుంచి గజ్వేల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కనబడకపోవడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ మండల ప్రెసి డెంట్ త్రీనేష్, కాంగ్రెస్ యూత్ సభ్యులు బట్ట నరేష్, బడే కోల్ నరేష్, అమ్ముల నవీన్, భాను, సన్నీ ఇతర నాయకులు పాల్గొన్నారు.