calender_icon.png 22 December, 2024 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విఘ్నేశ్వరుడికి లక్ష పుష్పార్చన

15-09-2024 02:05:10 PM

ముఖ్య అతిధులుగా గజ్వేల్  మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి.

ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కాల్వ సుజాత.

జగదేవపూర్ (విజయ క్రాంతి): జగదేవపూర్ మండల కేంద్రములో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని సన్నిధిలో సిద్దిపేటజిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నర్సరెడ్డి, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర చైర్మన్ కాల్వ సుజాత ముఖ్య అతిధులుగా హాజరై కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి దేవయలంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలి అని కోరుకున్నట్టు తెలిపారు.దేవాలయం భవనం పాతదిగా ఉంది ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వేంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యేలా చూస్తామాని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ హరినాథ్,శ్రీనివాస్, ఏం.శ్రీనివాస్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు  అమర రాము  మొహమ్మద్  అజీజ్, డాక్టర్ యాదగిరి,ఆర్యవైశ్య సంఘం  నాయకులు బుద్ధ వెంకటయ్య, చంద్రశేఖర్,బుద్ధ నాగరాజు, కిరణ్, బాల్ నారాయణ,బుద్ధ సత్యం ,వెంకటేష్ మహిళ అధ్యక్షురాలు సవిత,తదితరులు పాల్గొన్నారు.