గజ్వేల్,(విజయక్రాంతి): విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ పనిచేస్తుందని విద్యుత్ శాఖ గజ్వేల్ డిఈ భాను ప్రకాష్ అన్నారు. గజ్వేల్ డివిజన్ కార్యాలయంతో పాటు, గజ్వేల్ సబ్ డివిజన్, ములుగు సబ్ డివిజన్, తుక్కాపూర్ సబ్ డివిజన్ కార్యాలయాలలో ఆదివారం విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని విద్యుత్ సరఫరాలో సమస్యలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా డిఈ భాను ప్రకాష్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందన్నారు.
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని, గజ్వేల్ డివిజన్ పరిధిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వినియోదారులకు వినియోగదారులు విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యల ఫిర్యాదు చేసిన తక్షణమే సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏడీ జగదీశ్ ఆర్య, ములుగు ఏడీ జి శ్రీనివాస్, తుక్కాపూర్ ఏడీ N. శ్రీనివాస్, గజ్వేల్ ఏఈ మారుతి, డివిజన్ పరిధిలోని ఆయా మండలాల ఏఈలు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.