calender_icon.png 22 December, 2024 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులంతా సన్న వడ్లను పండించి బోనస్ పొందాలి

14-10-2024 05:34:29 PM

రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ దే

సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ రైతు ఖాతాల్లోకి 

గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి

గజ్వేల్,(విజయక్రాంతి): రైతులంతా సన్న బియ్యం వడ్లను పండించి కాంగ్రెస్ ప్రభుత్వం అందించే రూ.500 బోనస్ పొందాలని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్  వంటేరు నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ మండలం అహ్మదీపూర్, జగదేవపూర్ మండలం చాట్లపల్లి, మర్కుక్ మండలం ఎర్రవల్లిలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. ఎప్పుడు లేని విధంగా రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. రైతులు పండించిన పంట దళారీల పాలు కావద్దని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. మూడు మండలాల్లో 30 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు   తెలిపారు. ప్రతి రైతు ప్రభుత్వం అందిస్తున్న బోనస్ ను పొందాలని అందుకు అందరూ కూడా సన్నబియాన్ని పండించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఏం సి డైరెక్టర్లు కర్ణాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, యాదగిరి, నరస గౌడ్,  కాంగ్రెస్ నాయకులు అంజా గౌడ్,, నర్సింలు,రామా గౌడ్, బాలరాజు గౌడ్, రవీందర్ రెడ్డి మాధవరెడ్డి హనుమంత రెడ్డి, మల్లేశం, ఏవోలు నాగరాజు, నాగేందర్ రెడ్డి,  వసంతరావు,  ఐకెపి ఏపిఎంలు దుర్గాప్రసాద్, కిరణ్, ప్రసాద్, రైతులు అమాలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.