calender_icon.png 2 February, 2025 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో ఆత్మవిశ్వాసం పొందుతుంది

29-01-2025 07:21:05 PM

బైంసా (విజయక్రాంతి): ఆటల పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. బైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం డివిజన్ స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే పటేల్ విజేతలకు బహుమతులను అందజేశారు. ప్రిన్సిపల్ బుచ్చయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.