calender_icon.png 15 November, 2024 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాజెక్టుల నిర్మాణంలో రైతుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి

15-11-2024 07:54:44 PM

గద్వాల టౌన్,(విజయక్రాంతి): ప్రాజెక్టుల నిర్మాణంలో రైతుల త్యాగాలు ఎప్పటికీ మరువలేమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం మంజూరు చేసిన నష్టపరిహారంను ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ 90 మంది రైతులు  భూములు కోల్పోతే మొదటి విడతగా 46 మంది రైతులకు రూ. 5 కోట్ల 40 లక్షలు నష్టపరిహారం ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం  కృష్ణమ్మ వరదలతో రేకులపల్లి గ్రామంలో సమీపంలోని జెన్కో దగ్గర 67 ఎకరాల వరకు రైతులు తమ భూములను కోల్పోవడం జరిగిందన్నారు. దాదాపుగా 90 మంది రైతులు తమ భూములను త్యాగం చేసి జన్కో లో విద్యుత్ ఉత్పత్తికి సహకరించినందుకే  ప్రజలకు నాణ్యత మైన కరెంటు సరఫరా కావడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు భూమిని ఎంతో పెద్ద మనసుతో ఆనాడు భూమిని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందన్నారు. జెన్కో అధికారులతో పలుమార్లు కలిసి మాట్లాడి భూమిని కోల్పోయిన రైతులను ఆదుకోవాలని వారికి ఏదో రూపంలో ప్రభుత్వం వారికి నష్టపరిహారం అందించాలని కోరడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం భూములు కోల్పోయిన రైతుకు ప్రతి ఎకరానికి రూ. 7 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. ఏడు లక్షల రూపాయలు తక్కువని ప్రస్తుత భూమి విలువ రూ. 30, 40 లక్షల రూపాయలు విక్రమం అవుతుందన్నారు. త్వరలో మిగిలిన వారికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, రమేష్ నాయుడు, మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, కౌన్సిలర్ శ్రీను, రిజ్వాన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆంజనేయులు, నాయకులు హనుమంతు రెడ్డి, వంట భాస్కర్, కురుమన్న ధర్మ నాయుడు, రామాంజ నేయులు, మధు, వీరేష్, ఓం ప్రకాష్, కొత్త గణేష్ పరశురాముడు, అధికారులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.