calender_icon.png 27 December, 2024 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

02-12-2024 11:45:01 AM

సంగాల రిజర్వాయర్ వద్ద కృష్ణమ్మ కి పూజలు నిర్వహించి నీటి విడుదల...

 గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల (వనపర్తి ), (విజయక్రాంతి): రైతులకు రెండు పంటలకు చివరి ఆయకట్టు వరకు ప్రతి సన్నకారు రైతులకు సాగునీరు అందించాలనే ప్రభుత్వ లక్ష్యమని, రైతులు నీటిని వృధా చేయకుండా వాడుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  సూచించారు. సోమవారం  గద్వాల పట్టణ సమీపంలో గల సంగాల రిజర్వాయర్ ద్వారా నీటి విడుదల కార్యక్రమం ను నిర్వహించి అనంతరం కృష్ణమ్మ కి పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయడం తో పాటు  రైతుల పండించిన వరి ధాన్యంలో కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరిగిందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, రైతుల అభివృద్ధి కోసం సీఎం రైతులకు రైతుబంధు, రైతు రుణమాఫీ సున్న కారు రైతులకు 500 రూపాయలు బోనస్లను అందిస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు.

గత సంవత్సరం మాదిరిగానే సంఘాల చెరువు ద్వారా నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. గద్వాల మండల పరిధిలోని పలు గ్రామాలకు అదేవిధంగా గద్వాల పట్టణానికి కూడా సంఘాల చెరువు నీటిని ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్ మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి రమేష్ నాయుడు, మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్ కౌన్సిలర్స్ మురళి కృష్ణ శ్రీను నరహరి గౌడ్, రిజ్వాన్, నాయకులు గోవిందు, కురుమన్న, వంట భాస్కర్, లక్ష్మన్న, దౌలన్న, జగదీశ్వర్ రెడ్డి, గువ్వల గోపాల్, నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.