హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కృష్ణమోహన్ రెడ్డి చేరిక కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యాదయ్య (చేవెళ్ల), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), సంజయ్ కుమార్ (జగిత్యాల), దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం) ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 31కి తగ్గింది.