ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
గద్వాల(వనపర్తి) ఆగస్టు 1 (విజయక్రాంతి): గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ఇంట్లో తేనేటి విందులో పాల్గొన్న మంత్రి, అనంతరం మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. అసెంబ్లీ లాబీల్లో పరిచయం ఉన్న వారితో మాట్లాడినంత మాత్రాన పార్టీని వీడుతున్నట్లు కాదన్నారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడని చెప్పారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి గద్వాల ఎమ్మెల్యే అసెంబ్లీకి బయలుదేరారు. వారివెంట దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.