10 June, 2026 | 2:47 AM

గుట్టలపై కోర్టుకు వద్దు..

10-06-2026 12:59 AM

అంబేద్కర్‌కు మొరపెట్టుకున్న గద్వాల న్యాయవాదులు

గద్వాల టౌన్, జూన్ 9: జిల్లా కోర్టు సముదాయం నిర్మాణానికి అనంతపురం గుట్టల స్థలాన్ని ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ గద్వాల న్యాయవాదులు వినూత్న నిరసన చేపట్టారు. తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

ముందుగా జిల్లా కోర్టు ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించిన న్యాయవాదులు కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీసు పికెట్ను తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలోనే జిల్లా కోర్టు సముదాయాన్ని నిర్మించాలని శాంతియుత నిరసనలకు ఆటంకాలు కల్పించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.