19-04-2025 10:47:18 PM
గద్వాల (విజయక్రాంతి): ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ తాజాగా వెలువడిన ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన విద్యార్థి మంచి ర్యాంకు సాధించి టాప్ వరుసలో నిలిచారు. ఎన్ఐ టిఐఐటి లలో సీట్లు సాధించేందుకు మార్గం సమగం చేసుకున్నారు. అలాగే జేఈఈ అడ్వాన్స్ కు సైతం అర్హత సాధించడం గొప్ప విషయం. జోగులాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామానికి చెందిన పెద్ది విజయ భాస్కర్ మాధవి దంపతుల పెద్ది శివతేజ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 98.74 పర్సంటేజ్ వచ్చింది. ఓబిసి కేటగిరిలో శివతేజ 4881 ర్యాంకు సాధించాడు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచి మంచి ఫలితాలు సాధించినందుకు గ్రామస్తులు పలువురు వారిని అభినందించారు.