09-03-2025 05:17:07 PM
జిల్లా అధ్యక్షులు తీగల తిరుమల గౌడ్...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల ఆర్చరీ నేషనల్ పోటీలకు గడికోట ఆర్చరీ నలుగురు క్రీడాకారులు ఎంపికైనట్లు కోచ్ ప్రతాప్ దాస్ శనివారం తెలిపారు. ఈ సందర్బంగా కోచ్ మాట్లాడుతూ... కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఈ నెల 2న జరిగిన రాష్ట్ర స్థాయి మినీ ఛాంపియన్ పోటిల్లో మంచి ప్రతిభ చూపిన (రికర్వ్ అండర్-15 విభాగంలో) బి.ఇందు, అండర్-13 విభాగంలో వర్షిణి, (ఇండియన్ అండర్ -12విభాగంలో) డి. అకుల్, రమ్య ఈ నెల 22 నుండి 28 వరకు గుంటూరులో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. వీరిని ఆర్చరీ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అనిల్ కామినేని, జిల్లా అధ్యక్షులు తీర్మల్ గౌడ్, కార్యదర్శి మోహన్ రెడ్డి, నిజామాబాదు జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కార్యదర్శి నర్సింహా రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సీతారాం మధు, మండల అధికారులు, నాయకులు అభినందించారు.