తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ వెన్నెల
మేడ్చల్, జనవరి 31 (విజయ క్రాంతి) : అట్టడుగు వర్గాలైన దళితులు, వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం కలం, గళం ద్వారా గద్దర్ పోరాటం చేశారని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ డాక్టర్ వెన్నెల అన్నారు.
శుక్రవారం మేడ్చల్ జిల్లాలోని మహాబోధి విద్యాలయం లో నిర్వహించిన ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు పోరాటం చేశారని, తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చారని అన్నారు.
తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు గద్దర్ రచించిన పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో గద్దర్ సతీమణి విమల, కుమారుడు సత్యం హాజరై గద్దర్ కు ఘనంగా నివాళులర్పించారు.