calender_icon.png 23 September, 2024 | 8:55 AM

తెలంగాణ పోరులో గద్దర్ పాత్ర ఎనలేనిది

23-09-2024 12:30:03 AM

  1. సంస్మరణ సభలో ఎమ్మెల్సీ కోదండరాం 
  2. హాజరైన గద్దర్ కూతురు వెన్నెల

ఆదిలాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): తాడిత, పీడిత ప్రజల గొంతుకగా గ ళమెత్తిన ప్రజాయుద్ధనౌక గద్దర్.. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎనలేనిదని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో గద్దర్, సియాసత్ పత్రిక ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ సంస్మరణ సభను ఆదివారం నిరహించారు. ఈ కార్యక్రమానికి గద్దర్ కూతురు వెన్నెలతో కలిసి కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గద్దర్ నిత్యం సమాజ శ్రేయస్సు కోసమే పరితపించేవారన్నారు.

ప్రజా ఉద్యమాలను నిర్మించి తన ఆట పాటల దారా చైతన్యం రగిల్చారన్నారు. సియాసత్ ఎడిటర్ జహీరుద్దిన్ సైతం పత్రిక దారా సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు ఎంతో కృషి చేశారన్నారు. గద్దర్ కూతురు వెన్నెల మాట్లాడుతూ.. కన్నీళ్లను కత్తులుగా మార్చి ఉద్యమస్ఫూర్తిని రగిలించిన గద్దరన్న ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలన్నారు. ఆయన వారసతాన్ని పునికిపుచ్చుకుని తాను సైతం సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో నిరహణ కమిటీ కనీనర్ సోగల సుదరన్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

‘ఇథనాల్’ బాధితుల సమస్యల పరిష్కారానికి కృషి

నిర్మల్, సెప్టెంబర్ 22(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా దిలువార్‌పూర్ మండల కేంద్రం వద్ద చేపడుతున్న ఇథనాల్  ప్యాక్టరీతో నష్టపోయే రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని పెన్షనర్ల భవనంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్యాక్టరీ కోసం 6 గ్రామాల రైతులు చేస్తున్న ఉద్యమ ం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరను న్నట్టు తెలిపారు.