calender_icon.png 2 February, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండి తీరుతో గద్దర్ ప్రతిష్టకు భంగం...

29-01-2025 07:04:08 PM

మాజీ మంత్రి రామన్న...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): విప్లవకారుడు... ప్రజా యుద్ధనౌక గద్దర్ కు పద్మశ్రీ అవార్డుపై కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వాక్యాలను ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజా యుద్ధనౌకగా కీర్తి గడించిన గద్దర్ కు పద్మశ్రీ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ అంటే.. బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ మరో రకంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇలా ఇద్దరు నేతలు చెరో రకంగా మాట్లాడం చూస్తే బీజేపీ పార్టీలో నాయకుల మధ్య సఖ్యత లేదని, వారి మధ్య ఉన్న విభేదాలను బయటపడుతున్నాయని అన్నారు.

పద్మశ్రీ అవార్డు అనేది బీజేపీ పార్టీ ఇస్తున్న అవార్డు కాదని, ఇది జాతీయ అవార్డు అని పేర్కొన్నారు. జననాట్యమండలి ద్వారా ప్రజలను చైతన్యపరచిన ఘనత గద్దర్ కు దక్కుతుందన్నారు. చాలా సభల్లో ఆయనను బీజేపీ నాయకులే అభినందించారని గుర్తుచేశారు. ఇకనైనా ద్వంద్వ వైఖరి మాని సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వ్యక్తులకు పురస్కారాల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.