calender_icon.png 16 March, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెల్లాపూర్‌లో గద్దర్ మెమోరియల్ హాల్

17-12-2024 12:50:48 AM

* మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి

పటాన్‌చెరు, డిసెంబర్ 16: తెల్లాపూర్ మున్సిపల్ సర్కిల్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహం వద్ద సుందరీకరణ పనులు చేపడుతామని మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి సోమవారం తెలిపారు. రూ.50లక్షల మున్సిపల్ నిధులతో గద్దర్ మెమోరియల్ హాల్ నిర్మాణం, గ్రీనరీ, గార్డెన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలోనే పను లు ప్రారంభమవుతాయని కమిషనర్ తెలిపారు.