దివంగత ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేస్తున్నారు. దర్శకుడు నిర్మాత బి.నర్సింగరావు తెరకెక్కించిన ఈ చిత్రం దర్శకుడు, నిర్మాత, హీరో సత్యారెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదంతో రూపొందిన ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. తెలంగాణా రాష్ట్ర గీతం రూపశిల్పి అందెశ్రీ, గద్దర్ తనయుడు సూర్యం, జానపద కవి గోరటి వెంకన్న, ప్రొఫెసర్ కోదండరాం, నందిని సిధారెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు. ఈ మూవీలో గద్దర్ మూడు పాటలు పాడారు. రెండు పాటలు, కొన్ని సందేశాత్మక సీన్లలో నటించారు. గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించిన ఈ చిత్రాన్ని ఇదే నెల 30 విడుదల చేయనున్నట్టు చిత్ర దర్శక, నిర్మాత, కథానాయకుడు సత్యారెడ్డి తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, భూనిర్వాసితులకు న్యాయం కోసం ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమాను రూపొందించినట్టు చెప్పారు.