తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని కళాకారులను ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రజాగాయకుడు గద్దర్ పేరిట పురస్కారాలు అందజేయనున్నట్టు గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడు తూ.. ‘ఒకప్పుడు నంది పురస్కాలు ఇచ్చేవారు. అదంతా ఇప్పుడు చరిత్ర అయిపోయింది. అవార్డులు ఇస్తే నటీనటులకు ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఆ ప్రోత్సాహంతోనే మన సినిమాలు ఈ రోజు ప్రపంచవ్యా ప్తంగా ముందుకెళ్తున్నాయి. అవార్డులను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటమే కాదు, వాటికి ప్రజా గాయకుడు గద్దర్ పేరును పెట్టారు.
ఆ పేరుతో అవార్డులివ్వటం ఎంతో సముచితం” అన్నారు. తాజాగా మంగళవారం సినారె జయంతోత్సవంలో సీఎం మరోమారు అవార్డుల విషయాన్ని ప్రస్తావిస్తూ సినీ ప్రముఖులెవరూ ఈ విషయమై తమను సంప్రదించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తాజాగా ఎక్స్ వేదికగా స్పందిస్తూ తెలుగు చిత్రసీమ తరఫున ఫిలిం చాంబర్, ప్రొడ్యూ సర్స్ కౌన్సిల్ ఈ విషయమై దృష్టి సారించాలని పునరుద్ఘాటించారు.