calender_icon.png 3 March, 2025 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగాదికి ‘గద్దర్’ అవార్డులు

03-03-2025 01:24:38 AM

  1. మా ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహిస్తుంది
  2. నాటకరంగ కళాకారులకు కూడా అవార్డులు
  3. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్లడి 
  4. ఎల్బీ స్టేడియంలో ఘనంగా భక్తరామదాసు జయంతి ఉత్సవాలు

హైదరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): గత దశాబ్ద కాలం పాటు సినిమా కళాకారులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మల్లు ఆరోపించారు. ప్రతి ఏటా ఇవ్వాల్సిన నంది అవా ర్డులు ఇవ్వకుండా  నిర్లక్ష్యం చేశారన్నారు.

తాము అధికారంలోకి రాగానే, కళాకారులను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకు న్నామని, అందులో భాగంగానే గద్దర్  సిని మా అవార్డులను ఈ ఉగాది నుంచి ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటికే దీనికి కావాల్సిన చర్యలు ప్రభుత్వం చేపట్టినట్లు వివరించారు.

ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తరామదాసు జ యంతి ఉత్సవాల కార్యక్రమానికి మంత్రి సీతక్కతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రతి ఏటా తమిళనా డు తిరువయ్యూర్‌లో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాల మాదిరిగా ఇకపై ప్రతిఏటా తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా భక్త రామదా సు జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. భక్త రామదాసును స్ఫూ ర్తిగా తీసుకొని అనేకమంది సంగీత విద్వాంసులుగా, వాగ్గేయకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

నాటక రంగంలో రాణిస్తున్న కళాకారులను కూడా ప్రోత్సహించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. తెలంగాణ నాటక అకాడమీ చైర్మ న్ అలేఖ్య పుంజాల విజ్ఞప్తి మేరకు నాటక రంగ కళాకారులకు అవార్డులు ఇవ్వడానికి సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రాష్ర్టవ్యాప్తంగా నాటక పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులకు అవార్డులు ఇస్తామన్నారు.

ఈ ఉత్సవాల్లో ప్రముఖ సంగీత విద్వాంసులు డా.వెంకటేశ్వరరావు, డా.శోభారాజు, కళారత్న పురస్కార గ్రహీతలు హైదరాబాద్ బ్ర దర్స్ రాఘవాచారి, హైదరాబాద్ సిస్టర్స్ హ రిప్రియ, ప్రేమా రామమూర్తి, కోవెల శాంత, డీవీ మోహన్ కృష్ణ పాల్గొన్నారు.