calender_icon.png 5 October, 2024 | 2:54 PM

మంథనిలో ఘనంగా 'కాకా' జయంతి వేడుకలు

05-10-2024 01:03:52 PM

మంథని (విజయక్రాంతి): మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి వేడుకలను మంథనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదేశాల మేరకు మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, పట్టణ అధ్యక్షులు పోలు శివ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో (కాక) జయంతి వేడుకలు నిర్వహించి, కాక చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమా, పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలకల ప్రవీణ్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్ మాట్లాడుతూ.... స్వర్గీయ శ్రీపాద రావు, వెంకటస్వామి అనుబంధం ఎనాలేనిదని, ఎన్నో పోరాటాలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో వారి సేవలను అందించారన్నారు. 1949 లో దేశంలోనే మొదటిసారిగా జాతీయ గుడిసెల సంఘం పెట్టారని, కాకా పోరాటంతో హైదరాబాద్ నగరంలోనే దాదాపు 80 వేల మందికి సొంత గూడు దక్కిందని, భవన నిర్మాణ కూలీలు, రిక్షా కార్మికుల సమస్యలపైనా కాకా పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.