29-04-2025 07:54:52 PM
హనుమకొండ (విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పరిశోధకులు గద్దల ప్రేమ్ కుమార్ డాక్టరేట్ సాధించాడు. "మల్టీ కల్చరలిజం ఇన్ నీల్ బిసుందత్ ఫిక్షన్(Multiculturalism in Neil Bisundat's Fiction) లో బహుళ జాతివాదం" అనే అంశంపై చేసిన వివరణాత్మక పరిశోధనకు కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఆంగ్ల విభాగం ప్రొఫెసర్ ఎం.ప్రభాకర్ పర్యవేక్షణలో గద్దల ప్రేమ్ కుమార్ పరిశోధన పూర్తి చేశారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ సెమినార్ లలో పలు పరిశోధన పత్రాలను సమర్పించారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఖిలా వరంగల్ కు చెందిన గద్దల ప్రేమ్ కుమార్ సీకేఎం కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టరేట్ సాధించిన గద్దల ప్రేమ్ కుమార్ ను యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు, సహుద్యోగులు అభినందనలు తెలిపారు.