calender_icon.png 8 April, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసుల నోటీసులు

07-04-2025 01:49:32 PM

హైదరాబాద్: బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) నేత మన్నె క్రిశాంక్(Manne Krishank)కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏఐ ఉపయోగించి తప్పుడు పోస్టులు పెట్టారని నోటీసులు పంపారు. కంచ గచ్చిబౌలి భూముల అంశంపై తప్పుడు పోస్టులు పెట్టారని పోలీసులు తెలిపారు. ఈనెల 9,10, 11న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్(Gachibowli Police Station)కు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

హెచ్సీయూ భూములపై ఏఐ వీడియోలు(AI videos on HCU lands), ఫోటోలు పెట్టారని కొణతం దిలీప్, మన్నే క్రిషాంక్, థామస్ అగస్టీన్ పై కేసులు నమోదు చేశారు. కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ధ్రువ్ రాఠీ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, రవీనా టాండన్, జాన్ అబ్రహాం, దియా మీర్జా మరికొందరు ప్రముఖులపైనా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు సమాచారం. ఏఐ ఫొటోలను తయారు చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా, ఐటీ టీమ్ సభ్యులను కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు. వీరితో పాటు హెచ్ సీయూ వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ, ఏబీవీపీ, సీపీఎం కార్యకర్తలు సహా దాదాపు 150 మందిపైన పోలీసులు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు.