calender_icon.png 22 February, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన గచ్బిబౌలి ఏడీఈ

15-02-2025 01:41:49 AM

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 14: గచ్చిబౌలి ఏడీఈ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రూ.50వేల లంచం తీసుకుంటూ గచ్చిబౌలి ట్రాన్స్‌కో ఏడీఈ సతీష్ ఏసీబీకి చిక్కాడు. ఒకరికి ట్రాన్స్‌ఫార్మర్ ఇచ్చేందుకు రూ.75వేలు ఏడీఈ సతీష్ డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచనతో శుక్రవారం సతీష్‌కు బాధితులు రూ.50 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.