08-04-2025 12:10:58 AM
కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్ 7 (విజయ క్రాంతి): బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. నగర బి ఆర్ ఎస్ అధ్యక్షులు చల్ల హరి శంకర్ ఆధ్వర్యంలో నాయకులు మానకొండూరు లోని రామకృష్ణారావు నివాసంలో కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జీవి రామకృష్ణ రావును గజమాలతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొని మిఠాయిలను తినిపించుకున్నారు. ఈ సందర్భంగా నగర బి ఆర్ అధ్యక్షుడు చల్ల హరి శంకర్ మాట్లాడుతూ.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ బండారు వేణు, మానకొండూరు మాజీ జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మండల యూత్ అధ్యక్షులు అడప శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు యాదగిరి, సీనియర్ నాయకులు నెల్లి శంకర్, గడ్డం నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.