రామయంపేట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శుక్రవారం రోజు సిద్దిపేట చౌరస్తా కామారెడ్డి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జీ స్టోర్ సూపర్ మార్కెట్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆయన సూపర్ మార్కెట్ లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జీ స్టోర్ సూపర్ మార్కెట్ యజమాన్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్,టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు,పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు దాకి స్వామి.పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్. కంభంపాటి విప్లవ కుమార్. పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.