calender_icon.png 25 October, 2024 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో ఫ్యూచరిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రం

23-07-2024 01:26:20 AM

ఏర్పాటుకు ముందుకొచ్చిన వారికి అన్ని విధాలా సహకరిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు 

హైదరాబాద్, జూలై 22 (విజయ క్రాంతి): తెలంగాణలో ఫ్యూచరిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రం ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యాంశంగా పరిశీలిస్తుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఫ్యూచరిస్టిక్ కేంద్రంపై కొందరు పారిశ్రామికవేత్తలు సోమవారం సచివాలయంలో మంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం ఆవిష్కరణకు అవసరమైన రూ.500 కోట్ల నిధులను సమకూర్చేందుకు ఏదైనా వాణిజ్య సంస్థ ముందుకొస్తే ప్రభు త్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా నిధుల సమీకరణనూ పరిశీలిస్తామన్నారు. భారీ మాల్ తరహాలో ఉండే  ఈ కేంద్రంలో సమావేశ మందిరాలు, సినిమా హాళ్ల ఏర్పాట్లతోపాటు తెలంగాణ ఘనచరిత్ర, సాధించిన అభివృద్ధి, భవిష్యత్ గమ్యాల గురించి అవగాహన కల్పి ంచే విభాగాలు ఉంటాయని స్పష్టం చేశారు. పర్యాటకులను కూడా ఈ కేంద్రం విశేషంగా ఆకర్షిస్తుందని తెలిపారు.