24 May, 2026 | 1:23 PM

విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు

24-05-2026 12:09 PM

కరీంనగర్ క్రేమ్,(విజయక్రాంతి): విద్యతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కృషి చేయాలని ఈగల్ ఫోర్స్ ఎస్పీ రావుల గిరిధర్, ఇన్కం టాక్స్ ప్రిన్సిపల్ కమీషనర్ మురళీమోవాన్ అన్నారు.కరీంనగర్ లోని వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గంప వజ్రమ్మ విద్యా పురస్కారం, వై.రఘునాథం ఎక్స్ లేన్సీ అవార్డు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.

10వ తరగతిలో సాధించిన విజయంతో ఆగిపోకుండా ఉన్నత చదువులపై దృష్టి పెట్టాలని సూచించారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి మంచి మార్కులు సాధించిన వారు పురస్కారం అందుకోవడం సంతోషం కలిగిస్తోందని అన్నారు.వై రఘునాథం ఎక్స్ లేన్సీ అవార్డును లయన-కొండా వేణు మూర్తికి అందించారు. విద్యార్థులకు భవిష్యత్తుపై దిశా నిర్దేశం చేశారు.

వెంకట్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న అనాధ శరణాలయం బాల గోకులం విద్యార్థులకు ఆన్ లైన్లో కంప్యూటర్ కోడింగ్, ఆంగ్ల భాషలో ప్రావి ణ్యత పై క్లాసులు తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి ఇవి వేణుగోపాల్ సంతానమైన ఇవి రిషిట, ఇ వి ఆర్యన్ సాయిలకు ప్రత్యేక సర్టిఫికేట్ ప్రదానం. చేశారు. 185 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ప్రధాన ఆచార్యులకు పురస్కారం అందజేశారు.