అర్జీ-3 ఏపిఏ జీఎం లు సుధాకర్ రావు, వెంకటేశ్వర్లు...
రామగిరి (విజయక్రాంతి): రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులతో పాటు బాధ్యతలను నిర్వర్తిస్తేనే భావి భారతావనికి మనుగడ అని అర్జీ-3 ఏపిఏ జీఎం లు సుధాకర్ రావు, వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవన్ని పురస్కరించుకొని సెంటినారికాలనీ లోని రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరై జాతీయ పతకాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... భారతదేశం నేడు అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని, ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలలో నాలుగవ దేశంగా భారత్ నిలిచిందని, 140 కోట్ల భారత జనాభాలో యువ శక్తి అధికంగా ఉండడం, మన నినాదం మనం ఇద్దరం మనకు ఇద్దరు అనే నినాదం అని తెలిపారు. నేడు ప్రపంచం పటంలో 70 దేశాలలో మన యువత సత్తా చాటుతున్నారని అది మన దేశ స్థానాన్ని చాటి చెబుతుందని తెలిపారు.
భారత రాంజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను అనుభవిస్తున్న మనం ఆ బాధ్యతలను కూడా నిర్వర్తించాలని కానీ నాడు భావి భారతదేశం అంధకారంలోకి వెళ్ళుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి ఒక బొగ్గు ఉత్పత్తి లోనే కాక అనేక రంగాలలో రానిస్తుందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తిలో మనకన్నా ముందు ఉన్న సెక్టర్ల కన్నా సింగరేణి రానిస్తుందని దానికి కార్మికులే కారణమన్నారు. మన లక్ష్య సాధనకు ఎవరికి వారీగా ఇష్టంగా కష్టపడితే అది సాధ్యమని అన్నారు. అనంతరం ఉత్తమ కార్మికులను ఘనంగా సన్మానిచ్చారు. ఈ సందర్బంగా నిర్వహించిన సంస్కతిక కార్యక్రమాలు పలువురిని అక్కట్టుకున్నాయి.