calender_icon.png 19 March, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి

19-03-2025 12:47:13 AM

పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్..

హైదరాబాద్ (విజయక్రాంతి): భవిష్యత్తులో తెలంగాణకు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందని పీసీసీ అధ్యకుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. అది కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని తెలిపారు. మంగళవారం శాసనమండలిలో మహేశ్ కుమార్ బీసీ బిల్లులపై మాట్లాడారు. బీహార్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో బీసీ సామాజిక వర్గం నుంచే సీఎం అయ్యారని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయడం గొప్ప నిర్ణయమని, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలని కోరారు.