calender_icon.png 19 February, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓఆర్‌ఆర్ లోపల మరింత అభివృద్ధి

14-02-2025 01:25:23 AM

  1. ట్రాఫిక్ నియంత్రణకు గూగుల్ సాంకేతికత
  2. చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు
  3. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష 

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు, నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకువెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

ఇందు కు సంబంధించి ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా మొత్తం నిర్వహించాలని అధికారులకు సూచించారు. నగ రంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకుని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుం డా చూడాలన్నారు.

నానక్‌రామ్‌గూడలోని హెచ్‌జీసీఎల్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్‌పై అధికారులతో సీఎం గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు. నగరంలో గృహాలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని తెలిపారు.

చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమైన ఏడు కూడళ్లలో ఫ్లు ఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని, భూసేకరణ ఇతర పనులను పూర్తి చేసి వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం సూచించారు.