calender_icon.png 15 November, 2024 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైవేల నిర్మాణంతో మరింత అభివృద్ధి

12-11-2024 01:29:45 AM

ఖమ్మంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  1. 2025 మార్చి నాటికి వందశాతం పనులు పూర్తి 
  2. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

ఖమ్మం, నవంబర్ 11 ( విజయక్రాంతి) : జిల్లాలో పెద్ద ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుందని.. త్వరలోనే ఖమ్మం, చుట్టు పక్కల ప్రాంతాలు మరింత అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం ఖమ్మం అర్బన్ మండలం అల్లీపురం  మధ్య నిర్మాణంలో ఉన్న ఔటర్‌రింగ్ రోడ్డు వద్ద మీడియాతో మాట్లాడారు.

ఖమ్మం జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు నిర్మిస్తున్న జాతీయ రహదారుల వివరాలను వివరించారు. హైదరాబాద్  కారిడా ర్‌లో భాగంగా  సూర్యాపేట, ఖమ్మం వరకు నాలుగు లేన్ల నిర్మాణం పూర్తి చేశామని, ప్రస్తుతం  ఖమ్మం నుంచి  దేవరపల్లి  వరకు గ్రీన్ ఫీల్డ్ నాలుగు లేన్ల హైవేను మొత్తం 165 కిలోమీటర్లు  5 ప్యాకేజీలలో చేపట్టామన్నారు.

జిల్లాలో మొదటి ప్యాకేజీ  కింద రూ.772 కోట్లతో 33 కిలోమీటర్ల పనులు సోమవారం వరకు 60 శాతం, రెండో ప్యాకేజీ కింద రూ.637 కోట్లతో చింతగూడెం వరకు 29 కిలోమీటర్ల మేర చేప ట్టిన పనులు 62 శాతం, మూడవ ప్యాకేజీ  కింద చింతగూడెం నుంచి రేచర్ల (ఏలూరు) వరకు రూ.804 కోట్లతో 42 కిలోమీటర్ల  మేర చేపట్టిన పనులు 66 శాతం పూర్తయినట్లు చెప్పారు.

2025 మార్చి  నాటికి  హైవే పనులు వంద శాతం పూర్తి కావాలని, అదే సమయానికి ఆర్వోబీ కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో  సాగునీటి వసతి లేని రఘునాథపాలెం మండలానికి పంద్రాగస్టు నాటికి మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా  సాగునీ టిని అందిస్తామని మంత్రి తెలిపారు. ఆయనవెంట గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఉన్నారు.