26-03-2025 07:06:00 PM
న్యాయవాది మాదరి రాకేష్..
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు మంత్రి పదవి కేటాయిస్తేనే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని న్యాయవాది మాదరి రాకేష్ బుధవారం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వినోద్ కు మంత్రి పదవి దక్కితే బెల్లంపల్లి ప్రాంతంలో ఇండస్ట్రీలు, కంపెనీలు వచ్చే అవకాశం ఉంటాయన్నారు. బెల్లంపల్లికి బస్సు డిపోతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయాన్న ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రాంతంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు పరుగు పెట్టాలంటే అధిష్టానం ఎమ్మెల్యే వినోద్ కు మంత్రి పదవి కట్టబెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.