calender_icon.png 3 April, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్నిప్రమాదంలో ఫర్నిచర్ షాపులు దగ్ధం

31-03-2025 01:35:11 AM

సంఘటన స్థలాన్ని పరిశీలించిన వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని

హనుమకొండ, మార్చి 30 (విజయ క్రాంతి): హన్మకొండ ములుగు రోడ్డులో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 5 ఫర్నిచర్ షాపులు పూర్తిగా కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించి సంఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు.ఈ అగ్ని ప్రమాదంలో మిషనరీ, టేకు కర్రలు పూర్తిగా కాలిపోయాయి. సుమారు కోటిన్నర రూపాయలు నష్టం జరిగిందని, ఈ సంఘటనతో ఆర్థికంగా నష్టపోయామని, జీవనోపాధి కోల్పోయామని ఎమ్మెల్యే కి తమ గోడును వినిపించారు.

ఈ సంఘటన వివరాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం తరపనున  ఆర్థిక సహాయం అందించడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి సురేందర్, డివిజన్ అధ్యక్షులు గన్నారపు సంగీత్ కుమార్, జక్కుల రవీందర్ యాదవ్, కాజిపేట తహసిల్దార్ భావ్ సింగ్, నాయకులు బంక సంపత్ యాదవ్, నాయుని లక్ష్మారెడ్డి, మాడిశెట్టి రాజ్‌కుమార్, గన్నారపు కమల్, పి. సదానందం, గద్దల శివ, అంబేద్కర్ రాజు, నాగ సోమేశ్వర్ పాల్గొన్నారు.