కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు గుంట శ్రీశైలం
మందమర్రి,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని లక్ష్యసాధనకు కృషి చేయాలని జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుంట శ్రీశైలం, చేగొండ శంకరయ్యలు కోరారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని(76th Republic Day) పురస్కరించుకొని మున్సిపల్ పరిధిలోని 6వ వార్డ్ నార్లపూర్ లో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు ఫర్నిచర్, విద్యార్థులకు నోటు పుస్తకాలు కంపాక్స్ బాక్స్ లు, పెన్నులు అందచేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో సరిపడా ఫర్నిచర్ సౌకర్యం లేకపోవడంతో ఫర్నిచర్ అందించడం జరిగిందన్నారు.
విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాల పేరు ప్రఖ్యాతలు నిలబెట్టాలని కోరారు. పాఠశాల అభివృద్ధి కోసం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణల దృష్టికి తీసుకువెళ్లి పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణoతో పాటు, విద్యార్థులకు బెంచీలు, మార్కర్ బోర్డ్, ఏర్పాటు చేయడంతో పాటు మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దేలా పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యేలా తమ వంతు కృషి చేస్తామనీ వారు స్పష్టం చేశారు. అంతకు ముందు పాఠశాలలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాఠశాల ప్రధానో పాధ్యాయులు లూథర్ కింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్క రించారు.
ఈ కార్య క్రమంలో నార్లాపూర్ 6వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అంకం రాజ్ కుమార్, కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎనుగుల బీరయ్య, నాయకులు గోపతి శ్రీనివాస్, బొలిశెట్టి వేణు, కూన సత్యనారాయణ, కోరే చిన్న గట్టు,బిఆర్ఎస్ పార్టీ మాజీ వార్డ్ అధ్యక్షులు చేగొండ శంకర య్య, గ్రామస్థులు అరుకటి మొండయ్య, కోరే వెంకన్న, ప్రకాష్, ఆర్ఎంపి డాక్టర్ వెంకటేశం, పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.