calender_icon.png 7 October, 2024 | 7:57 PM

ఉగ్రరూపం దాల్చిన గోదావరి

04-09-2024 02:30:01 AM

హైదరాబాద్/నల్లగొండ/వనపర్తి, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): గోదావరికి వరద కొనసాగుతోంది. మేడిగడ్డ వద్ద 9 లక్షలకు పైగా క్యూసెక్కుల భారీ వరద ప్రవాహం సాగుతోంది. ఎగువన శ్రీరాంసాగర్‌కు సైతం సుమారు 2.45 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఎస్సారెస్పీకి వరద ఉధృతి కొనసాగుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువనకు విడుదల చేస్తున్నారు. కృష్ణాబేసిన్‌లో శ్రీశైలానికి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. ఆల్మట్టికి ఎగువ నుంచి ప్రవాహం దాదాపుగా తగ్గిపోయింది. తుంగభద్ర ప్రాజెక్టుకు సైతం వరద కొనసా గుతుండటంతో పూర్తి నీటి మట్టానికి చేరువైంది.

నారాయణపూర్ డ్యాం నుంచి 2ల క్షల  క్యూసెక్యుల వరద రావడంతో జూరాల జలాశయం నిండుకుండలా మారింది. 27 గేట్లు ఎత్తి దిగువకు 2,09,067  క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి నిల్వ సామర్థ్యం 318.65 అడుగులకు గాను 317.760 అడుగులు ఉన్నది. నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి వరద కాస్త తగ్గుముఖం పట్టింది. రిజర్వాయర్‌లోకి 3 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు 26 క్రస్టుగేట్లలో 10 గేట్లను 10 అడుగులు, 16 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి  2 లక్షల 64 వేల క్యూసెక్కులను స్పిల్ వే గుండా నదిలోకి విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 585.90 అడుగులు (300.0315 టీఎంసీలు)గా ఉంది.